డాక్టర్, బాబు జగ్జీవనరామ్ ఆశయాలను ప్రతి పౌరుడు కొనసాగించాలని , దండోరా, ఎమ్మార్పీఎస్

డాక్టర్, బాబు జగ్జీవనరామ్ ఆశయాలను ప్రతి పౌరుడు కొనసాగించాలని , దండోరా, ఎమ్మార్పీఎస్

డాక్టర్, బాబు జగ్జీవనరామ్ ఆశయాలను ప్రతి పౌరుడు కొనసాగించాలని , దండోరా, ఎమ్మార్పీఎస్ 

 జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు

 అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో  డాక్టర్ బాబు జగ్జీవనరామ్ 38వ వర్ధంతి సందర్భంగా మంద కృష్ణ మాదిగ నాయకత్వం బలపరుస్తూ తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఆర్డిటి కాలనీ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రామగారి చిత్రపటానికి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టీ ఆదినారాయణ మాదిగ, పెద్దపప్పూరు మండలం సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం, లైబ్రరీ ఆదిమూర్తి, వెంకట్ రాముడు, దివాకర్,  పెద్దక్క, లక్ష్మీదేవి లారీ డ్రైవర్ బాలి తదితరులు పాల్గొని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టీ ఆదినారాయణ మాదిగ పూలమాలవేసి నివాళులర్పిస్తూ వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు దళిత హక్కుల పరిరక్షకుడు పరిపాలన దక్షకుడు భారత దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవనరామ్ 38వ వర్ధంతి కార్యక్రమాలు దేశ్వ్యాప్తంగా జరుగుతున్నాయి. దేశ సమగ్రతకు జాతి సమైక్యతకు కృషిచేసి భారత రాజ్యాంగానికి కాపలాదారుడిగా వ్యవహరించి దళితుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆ మహనీయుని ఆశయాలను ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మహిళా నాయకురాలు లక్ష్మీదేవి, పెద్దక్క, గంగమ్మ,  లైబ్రరీ ఆదిమూర్తి వెంకట రాముడు, డ్రైవర్ బాలి దివాకర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.