జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలి

జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలి

 కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎం.పీ.డీ.వో ఏ.పీ.డి మీటింగ్ ఏర్పాటు చేశారు ప్రతి గ్రామ పంచాయతీ లోను ఉపాధి కూలీలకు పనులు కల్పించి కూలీల శాతాన్ని పెంచాలి మండలానికి కేటాయించిన టార్గెట్ల ప్రకారం కూలీలకు పని కల్పించాలని జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని గురించి అవగాహన కల్పించి పనికి రప్పించి వంద రోజులు పూర్తి అయ్యేటట్లు చూడాలి అదేవిధంగా ప్రతికూలీకి 300 రూపాయలు రోజుకు కూలి పడే విధంగా పని చేసేలా తెలియపరచాలని,2024 25 ఆర్థిక సంవత్సరానికి పండ్ల తోటల పెంపకానికి రైతుల నుండి అప్లికేషన్లు తీసుకొని ఎస్టిమేట్లు తయారు చేయాలి వేసవి కాలం దృష్ట్యా పని ప్రదేశంలో నీరు నీడ మెడికల్ కిట్లు ఏర్పాటు చేసి పని వద్ద సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలి కూలీలు వడదెబ్బకు గురి కాకుండా ఉండేటట్లు జాగ్రత్తగా ఉండేలా ఏర్పాట్లు చేయాలనీ టెక్నికల్ అసిస్టెంట్లకు క్షేత్ర సహాయకులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఏ.పీ.డి శ్రీనివాసులు ఏ.పీ సుధాకర్ అవగాహన కల్పించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్లు రాజేంద్ర, రాజారెడ్డి, హనుమంత్ రెడ్డి, ఆంజనేయులు,నాగముని క్షేత్ర సహాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లు కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు