ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించండి.

ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించండి.

(జన చైతన్య న్యూస్)ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి. పుట్లూరు మండల పరిధిలోని ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను పుట్లూరు బిజెపి మండల అధ్యక్షుడు రాగేని రామంజి యాదవ్ పేర్కొన్నారు . అదేవిధంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉపాధి హామీ పనులు వెళ్లి జీవనం సాగిస్తున్నారు.అంతేకాకుండా రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి.కానీ కనీస సౌకర్యాలు కల్పించ లేదు కూలీలకు కనీస అవసరాలు అయినా త్రాగునీరు మెడికల్ కిట్లు , టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.ఎండలు ఎక్కువ ఉండడంతో కూలీలు వడదెబ్బ తగిలే అవకాశం ఉందని ఇప్పటికైనా ఈ కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులు పుట్లూరు బిజెపి మండల  అధ్యక్షుడు రాగేని రామాంజి యాదవ్ డిమాండ్ చేశారు.