సేవా సైనికులు వాలంటీర్లు

సేవా సైనికులు వాలంటీర్లు
సేవా సైనికులు వాలంటీర్లు

కొనకలమిట్ల వాలంటరీ సన్మానిస్తున్న ఎమ్మెల్యే అన్న

సంక్షేమ పథకాలు అందించడంలో వాలంటీర్లు కీలక పాత్ర   

కొనకలమిట్ల ఫిబ్రవరి 26  జనచైతన్య న్యూస్ : సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేందుకు వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని వైకాపా ప్రభుత్వం ఆంటి వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు. సోమవారం వాలంటీర్లు  వందన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు సేవారత్న ,.సేవా మిత్రా, సేవ వజ్రా, పొందిన వాలంటీర్లను ఆయన శాలువాలు  కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తెచ్చారని అందులో భాగంగా వాలంటీర్ ఏర్పాటు చేసి వారి ద్వారా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దివ్యంగత మాజీ సీఎం వైఎస్  రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ఇందిరామ గృహాలతో పాటు పింఛన్లు వివిధ సంస్థల పథకాలు అమలు చేసి ప్రజా ఆదరణ పొందాలని అన్నారు, ఆయన అడుగుజాడల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు చేయడంతో పాటు ఎన్నికలు ఇచ్చిన హామీల 98% పైగా నెరవేర్చాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ, జెడ్పిటిసి అక్కి దాసరి ఏడుకొండలు,  వైకాపా మండల కన్వీనర్ మూర శంకర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ పెద్ద వెంకటరెడ్డి, ఏం శ్రీనివాస్, రెడ్డి దివ్యాంగుల విభాగం జిల్లా సెక్రెటరీ బాలచంద్రుడు, ఎస్సీ సెల్ నాయకులు చెరుకూరి కోటేశ్వరరావు, సింగిల్ విండో అధ్యక్షుడు కామసాని వెంకటేశ్వర్ రెడ్డి, ఉడుముల కాశిరెడ్డి, ఎంపీడీవో జనార్ధన్ ,వైఎస్ఆర్ కెపి ఏపిఎం గోపాలకృష్ణారెడ్డి, ఎంపిటిసిలు సర్పంచులు కమలాకర్ రావు సర్పంచ్లు సిసిలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు