అయోధ్యలోశ్రీరామ్ కళ్యాణంవేడుకలో అద్భుత దృశ్యం
అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.బాలరాముడి నుదిటిపై కన్పించిన ‘సూర్య తిలకం ’తో భక్తజనం పరవశించిపోయింది.
అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.