యాడికి లో 108 అంబులెన్స్ ఉన్న లేనట్టే అనే కథనంపై వివరణ

యాడికి లో 108 అంబులెన్స్ ఉన్న లేనట్టే అనే కథనంపై వివరణ

యాడికి లో 108 అంబులెన్స్ ఉన్న లేనట్టే అనే కథనంపై వివరణ

 జనచైతన్య న్యూస్- యాడికి

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండల కేంద్రంలో ని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సహాయం కొరకు 108 అంబులెన్స్ ను అందుబాటులో ఉంచడం జరిగింది. దీనిపైన ఆగస్టు 03 వ తేదీ పలు దినపత్రికలలో ప్రచురితమైన 108 అంబులెన్స్ ఉన్న లేనట్టే అనే కథనంపై అంబులెన్స్ డ్రైవర్ తన వివరణ ఇవ్వడం జరిగింది.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం నేను ఆర్టీసీ డ్రైవర్ గా వెళ్లడం లేదు అని, అంబులెన్స్ కొన్ని నెలల కిందట యాక్సిడెంట్ జరిగినప్పుడు, జిపిఆర్ఎస్ కనెక్ట్ కట్ అయిందని, డాక్టర్లు రెఫర్ చేసినప్పుడు యాడికి నుంచి అనంతపురం జిల్లా ఆసుపత్రికి పేషెంట్లను తరలించడం జరుగుతుందని, అలా పేషంట్లను ఆసుపత్రిలో చేర్పించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది అకతాయిలు ఫోటోలు తీసి కోంతమంది విలేఖరులకు చేరవేయడం జరిగింది. అదే నిజమనుకున్న విలేఖరులు ఆ ఫోటోలు తీసుకుని 108 అంబులెన్స్ ఉన్నా లేనట్లే అనే కథనం పలు దినపత్రికలలో ప్రచురితం కావడంతో వాటిని చూసిన నేను ఈ వివరణ ఇచ్చుకోవడం జరుగుతుందని అవన్నీ అవాస్తవాలని అంబులెన్స్ డ్రైవర్ తెలియజేశారు.