బొంతలపల్లి లో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది
బొంతలపల్లి లో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది
జనచైతన్య న్యూస్- తనకల్లు
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలంలో చీకటి మానిపల్లి గ్రామం పరిధిలో ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాలలో ప్రపంచ తల్లిపాలు వారోత్సవాలు ను ఘనంగా నిర్వహించడం జరిగింది. బొంతలపల్లి లో డాక్టర్ ధర్మరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అమ్మ పాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అని గ్రామంలో ర్యాలీ నిర్వహించి తల్లులలో తల్లి పాలు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి తల్లి తన బిడ్డకు గంటలోపు మురిపాలు తప్పనిసరిగా తాపించాలి అని కోరారు, అదేవిధంగా ఐ సి డి ఎస్ సూపర్వైజర్ లక్ష్మీ దేవమ్మ మాట్లాడుతూ, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే శిశువుకు సంపూర్ణ ఆహారం అని, తల్లిపాలు శిశువుకు నిమోనియా అతి సారం వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి కాపాడుతుందని, తల్లిపాలు పిల్లల మేధస్సును మెరుగు పరచడంలో సహాయపడతాయన, తల్లిపాలు అధిక రక్తపోటు మధుమేహం స్థూలకాయం వచ్చే అవకాశాలు తగ్గిస్తాయన్నారు, అదేవిధంగా ఏ ఎన్ ఎం సుస్మిత మాట్లాడుతూ, తల్లిపాలు ఇచ్చే వారిలో రొమ్ము అండాశయం గర్భాశయానికి వచ్చే క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లి బొరువు తగ్గడానికి సహాయపడుతుందని, తల్లి, బిడ్డల మధ్య ప్రేమ బంధాన్ని నిలుపుతుందని తెలిపారు, అంగన్వాడీ కార్యకర్త రెడ్డమ్మ మాట్లాడుతూ, అంగన్వాడీ లో ఇచ్చేటువంటి సేవలు తల్లులు పొందాలని పిల్లలను అంగన్వాడీలకు పంపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ లక్ష్మీ దేవమ్మ, డాక్టర్ ధర్మరాజు, మహిళా కార్యదర్శి మాధవి, సిహెచ్ఓ చందన, ఏఎన్ఎం లక్ష్మి, అంగన్వాడి కార్యకర్తలు రామక్క, భారతి, మీనాక్షి, అలివేలు, దిల్ సాద్, ఆయాలు, ఆశ వర్కర్లలు, గర్భవతులు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.