గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ సంకల్పకులు నరసింహులు :-

గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ సంకల్పకులు నరసింహులు :-

గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ సంకల్పకులు నరసింహులు :-                 

 ఓ.డి.చెరువు మే(జనచైతన్య న్యూస్):-మండల పరిధిలో సున్నంపల్లి వద్ద సోమావతి నది ఒడ్డున వెలసిన శ్రీ ఏటి గంగమ్మ గుడిలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు నరసింహులు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవంగా గ్రామ భక్తుల విశ్వాసం,మాసంలో ఒకరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు,భక్తులు పదుల సంఖ్యలో పాల్గొని పసుపు,కుంకుమ,అభిషేకాలు పూజలు నిర్వహించి, వస్త్రాలు గాజులు,వివిధ పుష్పాలతో అలంకరించి,ధూపదీప నైవేద్యాలు సమర్పించి,కర్పూర హారతి నీరాజనాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి,భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారన్నారు.