ఫోరం ఆర్టిఐ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా రమేష్ నియమించారు

ఫోరం ఆర్టిఐ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా రమేష్  నియమించారు

గుంటూరు జిల్లా అధ్యక్షులు గా రమేష్           .                          ఎంప్లాయిస్ వింగ్ ఏర్పాటు ఫోరం ఆర్టీఐ లో వినూత్న మార్పు

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

అమరావతి   సమాచార హక్కు చట్టంపై, హ్యుమన్ రైట్స్ పై లోకాయుక్త పై అవగాహన కల్పిస్తున్న ఫోరమ్ ఫర్ ఆర్టీఐ గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గా వేమవరపు రమేష్ బాబు ను జాతీయ ఉపాధ్యక్షులు మట్ట ప్రసాద్ నియమించారు.

భారతదేశ చరిత్రలో ఒక ఆర్టీఐ సంఘం లో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేయటం ఓ మలుపు. ఆర్టీఐ నీ ప్రభుత్వమే ప్రజలకు అవగాహన కల్పించాలని అనే అంశాలు దృష్టిలో ఉంచుకుని పలు శాఖలను జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ ఆదేశాలతో ఫోరమ్ ఫర్ ఆర్టీఐ నాయకులు చొరవ తీసుకుని ముందుకు వెళుతున్నారు.

ఆర్టీఐ గురించి, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో కలిసి  ఫోరం రైట్ టూ ఇన్ఫర్మేషన్ పనిచేస్తుందని మట్ట ప్రసాద్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఫోరమ్ ఫర్ ఆర్టీఐ అభివృద్ధికి,కమిటీల ఏర్పాటు కు చొరవ తీసుకోవాలని రమేష్ ను మట్ట ఆదేశించారు.