ఎంపీడీవోల వీడ్కోలు ఆహ్వాన సభకు హాజరైన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు,ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్

ఎంపీడీవోల వీడ్కోలు ఆహ్వాన సభకు హాజరైన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు,ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్

ఎంపీడీవోల వీడ్కోలు ఆహ్వాన సభకు హాజరైన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు,ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్

 జనచైతన్య న్యూస్-యాడికి 

 అనంతపురం జిల్లా తాడపత్రి నియోజవర్గం యాడికి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనం నందు ఈ ఓ ఆర్ డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం ఎంపీడీవోల వీడ్కోలు,ఆహ్వాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్,ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు.అనంతరం అధికారులు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేస్తూ యాడికి మండలంను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని వారి సేవలను కొనియాడారు.బదిలీపై వెళ్తున్న ఎంపీడీవో సావిత్రి కి వీడ్కోలు పలుకుతూ,బదిలీపై మన మండలానికి వస్తున్న ఎంపీడీవో లక్ష్మీనారాయణ కి ఆహ్వానం తెలియజేశారు.గ్రామ సచివాలయ వార్డు సిబ్బంది,గ్రామపంచాయతీ కార్యదర్శులు,ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.