ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జనచైతన్య న్యూస్-పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరు గ్రామంలో స్థానిక శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా జెండా వందనం చేసి,విద్యార్థులు కొన్ని దేశభక్తి గీతాలను ఆలపించారు.అనంతరం నిర్వహించిన ప్రత్యేక పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.విద్యార్థులచే ప్రదర్శించబడిన కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి,హెచ్ ఎం మల్లేశ్వరి,ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.