కొండపల్లి ఆర్కిటెక్ భూములను ఆ ప్రాంత ప్రజలకు అధిక మొత్తం కాసులకు అమ్ముడు అయినవి అధ

కొండపల్లి ఆర్కిటెక్ భూములను ఆ ప్రాంత ప్రజలకు  అధిక మొత్తం కాసులకు అమ్ముడు అయినవి అధ

అన్యాక్రాంతం అవుతున్న ఆర్కియాలజీ భూములు

అధికారులకు కాసుల పంట

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

ఇబ్రహీంపట్నం కొండపల్లి పరిధిలో నిర్మాణంలో అనేక భవనాలు  కొండపల్లి ఇందిరానగర్ లో నిర్మాణంలో భవనం హైవే పక్కనే ఉన్నా కనీసం కన్నెత్తి చూడని అధికారులుకింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు భారీగా ముట్టినట్లు ఆరోపణలు

ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు చెందిన అనేక భూములు అన్యాక్రాంతం ఆ ఏరియా ఎమ్మార్వో ఆఫీస్ కాజా కొంతమంది దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిమధ్యవర్తి ద్వారా స్థలాలు అమ్మాడుఅక్కడ ప్రజలను ప్రశ్నించిన మీడియ  వారికి ప్రాంత ప్రజలు ఎవరి ముడుపులు వాళ్లకి అవుతున్నాయి అన్నారు. అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కొండపల్లి ఇందిరానగర్ సమీపంలో హైవే పక్కనే ఒక భవనాన్ని నిర్మిస్తున్నా కూడా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ భవన యాజమానులు కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు భారీగానే కాసులు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవన నిర్మాణ ప్రారంభ సమయంలోనే అధికారులకు పలువురుసమాచారమిచ్చినట్లు తెలిసింది. ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఇక్కడ పనిచేసే ఒక గుమ్మస్థాను ఇక్కడకు పంపి అతని ద్వారా యాజమానులతో చర్చలు జరిపి స్థల యాజమానుల వద్దనుండి భారీగా దండుకొని అంతా సైలెంట్ అయిపోయారు అంట. ఇప్పటికైనా ఆర్కియాలజీ అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూద్దాం. అయితే  ఆర్కియాలజీ కి సంబంధించిన భూములు ఇబ్రహీంపట్నం కొండపల్లి ప్రాంతంలో  అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇలా ఆక్రమణలకు గురవుతున్న సందర్భంలో ఫిర్యాదు చేయవలసిన అధికారుల ఫోన్ నెంబర్లు గాని అధికారుల సమాచారం కానీ ఎక్కడ లభించకపోవడం గమనార్హం. కొండపల్లి లోని ఈ భవనాన్ని పరిశీలనకు వచ్చిన గుమస్తాను పై స్థాయి అధికారుల సమాచారం ఇవ్వవలసినదిగా కోరగా అతను ఇవ్వలేదని కూడా తెలుపుతున్నారు.