అమడగూరు లో వైసీపీని వీడి టిడిపిలోకి చేరిక
వైసీపీ మాయమాటలు ఇంక నమ్మం:
సత్యసాయి జిల్లా అమడగూరు ఏప్రిల్ 26:జనచైతన్య న్యూస్ :మండలంలోని చినగానిపల్లికి చెందిన ప్రముఖులు వైసీపీ ని వీడి టీడీపీలో చేరారు వైసీపీ మాయమాటలకు కాలం చెల్లింది అన్నారు, అందుకే పుట్టపర్తి అభివృద్ధి వైపు వెళ్ళాలి అంటే పల్లె సిందూరరెడ్డి ని గెలిపించుకోవాలి అన్నారు, అందుకే పార్టీ కోసం కస్టపడి గెలిపించుకుంటామని తెలిపారు పార్టీలో చేరినవారిలో చినగానిపల్లి పంచాయితీ వైసీపీ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, రమణారెడ్డి, బీద భాస్కరరెడ్డి, లక్ష్మన్న కొత్తపల్లి, జయచంద్ర రెడ్డి యర్రగుంట్ల, మస్తాన్ రెడ్డి తదితరులు అమడగూరు మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు పార్టీలో చేరినవారికి పల్లె రఘునాథ్ రెడ్డి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు, పార్టీ లోకి చేరినవారు నిజాన్ని నిజాయితీని గెలిపించుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు