బందరు ఎంపీ అభ్యర్థిగా దర్శకుడు వివి వినాయక్
సారథి' స్థానంలో 'స్టార్' డైరెక్టర్ 'వినాయక్'
విజయవాడ -జన చైతన్య ( తమ్మిన గంగాధర్ )
బందరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ పేరు అనూహ్యంగా 'తెర' పైకి తెచ్చింది. తొలుత పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేపీ 'సారథి' ని ఎంపీగా 'బందరు' నుంచి రంగంలోకి దించాలని అధిష్టానం భావించింది. అందుకు సారథి విముఖత చూపడంతో ఎన్నిసార్లు చర్చించిన ఉపయోగం లేకపోవడంతో రాత్రికిరాత్రే చివరికి కాపు సామాజిక వర్గానికి చెందిన దర్శకుడు వినాయక్ పేరు తెరపైకి తెచ్చింది.సారథి' కి దాదాపు పెనమలూరు సీటు 'ఇచ్చెదిలేదని' తెల్చేసిన వైసీపీ అధిష్టానం, 'కొత్త' అభ్యర్థిని పోటీలో దింపేందుకు కసరత్తు చేస్తుంది.