పోలవరం ఒక లక్ష ఇరవై వేల మంది పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయండి, ఒక లక్ష మంది పామాయిల్ రైతులకు ఏలూరు జిల్లాలో ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పాలి, పార్లమెంట్ లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్

 జనచైతన్య న్యూస్- ఏలూరు

ఏలూరు జిల్లాలో పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమయంలో 241 నంబరు ప్రశ్నలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను 7 ఇంక్యుబేషన్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, ఏలూరు జిల్లాలో లక్ష మంది పైగా పామాయిల్ రైతులు ఉన్నారని, వారి సౌకర్యం  పామాయిల్ రైతుల లబ్ది కోసం ఏలూరు జిల్లాలో వ్యవసాయ పరిశోధన, ప్రాసెసింగ్, ఉత్పత్తి కేంద్రం (ఇంక్యుబేషన్ సెంటర్) ఏర్పాటు చేయాలన్నారు, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర మంత్రి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితిన్ రామ్ మాన్ జీ ని కోరడం జరిగింది. మరియు పోలవరం నిర్వాసితుల గురించి మాట్లాడుతూ 1,20,000 వేల మంది పోలవరం నిర్వాసితులు ఉన్నారని వారికోసం నూతన ఉపాధి అవకాశాలు, నూతన సంస్కృతి, నూతన జీవన విధానం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.దీనిపై సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితిన్ రామ్ మాన్ జీ, ఎంపీ పుట్టా మహీష్ కుమార్ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఏలూరు జిల్లాలో నూతనంగా ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది. పోలవరం నిర్వాసితులకు సరియైన లబ్ది చేకూర్చటానికి ప్రధాని నరేంద్ర మోడి సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాధానం ఇచ్చారు.