పంట నీరు ప్రణాళికపై సీఎస్ ఏ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
పంట నీరు ప్రణాళికపై సీఎస్ ఏ సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు.శ్రీ సత్య సాయి జిల్లా తలుపుల మండల పరిధిలోని గొల్లపల్లి తండా గ్రామపంచాయతీలో ఏపులపల్లి గ్రామంలో సిఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కె ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో వాటర్ ఎక్స్పెక్ట్ డాక్టర్ ఉమామహేశ్వర రావు పంట నీరు ప్రణాళిక అనే కార్యక్రమం గ్రామ రైతులు సమక్షంలో పంట నీరు కార్యక్రమం పై రైతులకు సవివరంగా ఏపులపల్లిలో రైతులకు వివరించడం జరిగింది. అదేవిధంగా ఎన్ ఎఫ్ సి శ్యామల ప్రకృతి వ్యవసాయం గురించి గ్రామ రైతులకు పూర్తిగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ రైతులు మరియు ఏపూలపల్లి సిఆర్పి పుష్ప మరియు ఈ మునేసులు గారు కె.వి రమణ గారు. కే.లక్ష్మీదేవి గారు సుజిత శారద అనూష గారు మిగతా సీఆర్పీలు గ్రామ రైతులు ప్రజలు పాల్గొనడం జరిగింది.