సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి.

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి.

(నార్పల జనచైతన్య న్యూస్) సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు ఎస్సై రాజశేఖర్ రెడ్డి. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని నార్పల ఎస్సై రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం నార్పల ఎస్ఐ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఉద్వేషకర రెచ్చగొట్టే తప్పుడు పోస్టులు పెట్టవద్దని సూచించారు. అంతేకాకుండా రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని పోలీసులు నిరంతరం గమనిస్తారని అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన చిత్రాలు వీడియోలను పోస్ట్ చేయవద్దని వ్యక్తిగత దూషణకు దిగడం వార్నింగ్ ఇవ్వడం అంతర్గత వివరాల గురించి అనవసర పోస్టులు కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టుకోవద్దని హెచ్చరించారు. సమాజంలోని వ్యక్తులపై సంస్థలపై గాని తప్పుడు రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన అలాగే శాంతి భద్రతలకు యుగాంతం కలిగించే విధంగా వాట్సాప్ ,ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్లో, పోస్టులు చేసిన షేర్ చేసిన తగిన చర్యలు తప్పవన్నారు .