ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ని పూలమాలతో సన్మానిస్తున్న ముస్లిం మైనార్టీలు

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ని పూలమాలతో సన్మానిస్తున్న ముస్లిం మైనార్టీలు

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ని పూలమాలతో సన్మానిస్తున్న ముస్లిం మైనార్టీలు 

జనచైతన్య న్యూస్-కదిరి 

 సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాదు ను పూలమాలతో ముస్లిం మైనార్టీలు ఘనంగా సన్మానించారు. శుక్రవారం స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన ముస్లిం కుటుంబం ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చిన పూలమాలతో ఎమ్మెల్యే కందికుంటను సన్మానించారు. వారు మాట్లాడుతూ కందికుంట వెంకటప్రసాద్ అంటే తమకు ప్రత్యేక అభిమానం అని, ముస్లిం మైనార్టీల కోసం ఆయన చేసిన సేవలు మరవలేనివని ఎమ్మెల్యేగా కందికుంట వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు అన్ని విధాల ఆదుకుంటారని వారు పేర్కొన్నారు. తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రత్యేకంగా కలిసి పూలమాలతో సన్మానించడం జరిగినది