దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసులు రెడ్డి విస్తృత ప్రచార:
దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సోదరుడు దుద్దుకుంట శ్రీనివాసులు రెడ్డి విస్తృత ప్రచార:
సత్యసాయి జిల్లా అమడగూరు మే 06:(జనచైతన్య న్యూస్) :మండలం కేంద్రంలోని గుండువారిపల్లి,కస్సముద్రం,చీకిరేవులపల్లి, పంచాయితీలోని చెర్లోపల్లి,కంచనగారిపల్లి,కొత్తూరు,గాజులపల్లి, కొలిమిరాళ్లపల్లి, బలకవారిపల్లి గ్రామాల్లో దుద్దుకుంట శ్రీనివాసులరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు,టీడీపీ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మకండి, గతంలో అధికారంలో ఉన్నపుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఇపుడు అధికారంలోకి వస్తే ఏదేదో చేస్తామంటే ఎలా నమ్మాలని అన్నారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు జగనన్న,నియోజకవర్గం అభివృద్ధి చేసిన నాయకుడు దుద్దుకుంట శ్రీధరన్న అన్నారు,గడప గడప కు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి దేశాయి భారతి రెడ్డి, మంజులవాణి, మాజీ జడ్పీటీసీ పొట్టా పురుషోత్తంరెడ్డి, జడ్పీటీసీ కవిత శివశంకర్ రెడ్డి,హరినాథ్ రెడ్డి,మండల కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి,సచివాలయ కన్వీనర్ దొడ్డెప్ప,యువనాయకులు శ్రీకాంత్,గోపి,బావాజీ,ప్రతాప్,మూర్తినవీన్, మదర్ వలి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు