మున్సిపాలిటీ సహకారం తో దేవాలయ భూమిలో అక్రమ కట్టడాలు జగ్గయ్యపేట

మున్సిపాలిటీ సహకారం తో దేవాలయ భూమిలో అక్రమ కట్టడాలు జగ్గయ్యపేట

మున్సిపాలిటీ సహకారం తో దేవాలయ భూమిలో అక్రమ కట్టడాలు జగ్గయ్యపేట

 జనచైతన్య న్యూస్- జగ్గయ్యపేట

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం ధనంబోడు పోయ్యే రోడ్డు, నాగలక్ష్మి అమ్మవారి టెంపుల్ సమీపంలో ప్రభుత్వ దేవాలయ భూమిలో కొందరు అక్రమదారులు యద్దేచ్ఛగా శాశ్విత నిర్మాణాలను చేస్తున్నారని కొందరు ప్రజలు గుసగుసలాడ్డుకుంటున్నారు. ఇట్టువంటి అక్రమ నిర్మాణ కట్టడాలకు జగ్గయ్యపేట మున్సిపల్ శాఖ అధికారులు మున్సిపాలిటీ కి కేటాయించిన్నట్లు చూపిస్తున్న వాటర్ ట్యాంకర్ తో నీళ్ళను అందిస్తూ అక్రమ కట్టడాలను ప్రోత్సాహిస్తున్నారని పలువురు నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ దేవాలయ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారుల తీరు కంచే చేను మేసినట్లు గా ఉందని స్థానిక ప్రజలు ముక్కు మీద వేళ్ళు వేసుకుంటున్నారు.వెంటనే ప్రభుత్వ దేవాలయ భూమిలో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్న, సహకరిస్తున్న మున్సిపల్ అధికారుల పై చర్యలు తీసుకొని దేవాలయ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలే ఉన్నతాధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.