స్కూల్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక :-
స్కూల్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక :-
అమడగూరు, జనచైతన్య న్యూస్ ఆగష్టు 08:- శ్రీ సత్యసాయి జిల్లా, అమడగూరు మండల పరిధిలోని,తుమ్మల గ్రామ పంచాయతీలో గల, జిల్లా పరిషత్ హైస్కూల్ నందు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు,స్కూల్ ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి,ఉపాధ్యాయులు సుభాష్ నాయక్ ,మారుతి ప్రసాద్, గురువారం పాఠశాల కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ఎన్నిక సమావేశం నిర్వహించారు. స్కూల్ కమిటీ చైర్మన్ గా, పసుపులేటి జయరాం, వైస్ చైర్మన్ గా అంజనమ్మ,ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల గ్రామ కమిటీ అధ్యక్షులు చంద్రమోహన్, మైనార్టీ అధ్యక్షులు రహమతుల్లా, బిజెపి నాయకులు మేకల శ్రీనివాసులు, జయరాం,లక్ష్మీనారాయణ, పాఠశాల సిబ్బంది,విద్యార్థుల తల్లి, తండ్రులు, పాల్గొన్నారు.