ఘనంగా ఆత్మీయ స్వాగత కార్యక్రమం:-
పుట్టపర్తి నియోజకవర్గం
ఘనంగా ఆత్మీయ స్వాగతం కార్యక్రమం.
అమడగూరు, జనచైతన్య న్యూస్ ఆగష్టు 08:-:మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో,ఘనంగా జూనియర్ విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికిన సీనియర్ విద్యార్థులు.గురువారం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆత్మీయ స్వాగతం కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య అవశ్యకత గురించి విద్యార్థులకు తెలియజేశారు.విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులు పడే కష్టాలను వివరించి,విద్య ఎలా లక్ష్యంతో నేర్చుకోవాలో,ఏ విధంగా సమాజంలో మెలగాలో తెలియపరిచారు.అలాగే అధ్యాపకులు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతికంగా ఎంతో ఉన్నతిగా ఎదిగిన సభ్యత సంస్కారం,వినయ విధేయతలను అలవర్చుకుంటేనే సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయని వాటిని క్రమశిక్షణ అనే ఆయుధంతో విజయం సాధించాలని విద్యార్థులకు తెలిపారు.అనంతరం సీనియర్స్ జూనియర్స్ కు స్నేహ పూర్వకంగా జ్ఞాపికలు అందించి ఆత్మీయంగా పలకరిస్తూ స్వాగతించారు.అనంతరం కళాశాల ప్రాంగణం విద్యార్థుల ఆటపాటలతో సందడి చేసుకున్నారు.