వ్యవసాయం సేంద్రియ పద్ధతులు చేయాలని బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు

వ్యవసాయం సేంద్రియ పద్ధతులు చేయాలని బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు
జనచైతన్య న్యూస్-కదిరి
సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామ పొలంలో యువ రైతులు ఇమ్రాన్, ముజాహిద్ లు సేంద్రియ పద్ధతులు వ్యవసాయం చేయాలని బొప్పాయి పంట వేయడం జరిగింది. ఆ పంటను ఈరోజు బిజెపి కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి సందర్శించడం జరిగింది, వారికి సేంద్రీయ ఎరువులు ఎలా వాడాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి, అనే విషయాలను వివరించడం జరిగింది. వ్యవసాయంలో రైతులు విపరీతమైనటువంటి రసాయన ఎరువులు వాడడం కారణంగా రైతు కు వ్యవసాయం భారంగా తయారయిందని, పెట్టుబడులు కూడా అధికమవుతున్నాయని ఆయన తెలియజేశారు, సేంద్రియ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించడం వలన తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు సాధించవచ్చని తెలిపారు. సేంద్రియ పద్ధతుల పండించిన పంటలకు ప్రస్తుతం మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగా ఉన్నదని ప్రజలు కొనుక్కోవడానికి శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు, కరోనా తర్వాత ప్రజలు ఆహారం విషయంలో శ్రద్ధ చూపుతున్నారని ఆరోగ్యం విషయంలో సేంద్రియ పద్ధతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ప్రజలకు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.