ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు
ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు
జనచైతన్య న్యూస్-అనంతపురం
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం రాజీవ్ కాలనీ గ్రామపంచాయతీలో ఈరోజు బిజెపి జిల్లా కార్యదర్శి కొనకొండ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా ఏకలవ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్య మహారాజ్ చరిత్ర కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు తెలియజేయడం జరిగింది. అనంతరం మిఠాయిలు పంపిణీ చేయడం జరిగింది. రాజీవ్ కార్యక్రమంలో కాలనీ ఎరుకుల సంఘం నాయకులు రాగిరి శ్రీనివాసులు, బిజెపి నాయకులు వెంకటరమణ, సూర్యనారాయణ ఆచారి, స్థానిక తెలుగుదేశం యువ నాయకులు వడ్డే వెంకటేష్, అశోక్, రంగనాయకులు, మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.