విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ 6 నెంబర్ జెట్టి లో కేంద్ర ప్రభుత్వ సాధికార సంస్థ

విజయవాడ -జన చైతన్య ( తమ్మిన గంగాధర్ ):- పిషరీ సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్ ఎస్ ఐ ఆధ్యర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఫీషరీ సైన్స్, మెరైన్ టెక్నాలజీ పట్ల అవగాహన కోసం మత్స్య షికారి, మత్స్య దర్శిని వెస్సెల్స్ లో ఏర్పాటు చేసిన జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డా.రవి శంకర్ ఐపీఎస్ తో పాటు పాల్గొనడం జరిగింది .ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో సముద్ర జలాల్లో లభ్యమయ్యే అరుదైన మత్స్యరాశులు, నౌకలో ఉపయోగించే నావిగేషన్ వ్యవస్థ, అగ్ని మాపక పరికరాలు, రక్షణ వ్యవస్థ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా విశాఖ ఇన్చార్జ్ బామిరెడ్డి షిప్ నెట్ డైరెక్టర్ బిషోయ్ , విశాఖ సిటీ డిసిపి 2 ఆనంద రెడ్డి , విశాఖ మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ లాల్ మహమ్మద్ , వన్ టౌన్ సిఐ బాస్కర్ రావు , ఎడి ఫిషరీస్ విజయ్ కుమార్, ఎఫ్ డి ఓ మురళి, ఆశాజ్యోతి, సీఎం ఎఫ్ ఐ ఆర్ సైంటిస్టులు, మెరైన్ ఇంజనీర్స్, అధిక సంఖ్యలో వివిధ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి విద్యార్థిని, విద్యార్థులు, పర్యాటకులు పాల్గొనడం జరిగింది. వాసుపల్లి జానకిరామ్ ప్రెసిడెంట్ ఏపీ మెకనైజ్డెడ్ బోట్స్ అసోసియేషన్ .