విజయ్ మాల్యాద్రి బిజెపి పార్టీ కి 35 కోట్ల ఫండ్ చెక్కుగా ఇచ్చాడు
లండన్ కి పారిపోక ముందు విజయ్ మాల్యా ద్వారా 35 కోట్ల చెక్కు బీజేపీ పార్టీ కి ఫండ్ గా ఇచ్చినది
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
దొంగలకు సద్ది కట్టే వాళ్లే ఇప్పుడు దొంగ దొంగ అని అరుస్తున్నారు. దేశం కోసం ధర్మం కోసం అనే దబాయింపు ఒకటి! ఇలాంటి లీలలు ఎన్నో చేసిన బిజెపి పార్టీ ఈరోజు దేశం కోసం ఒకే పార్టీ ఒకే ఎన్నిక ఇలాంటి పిచ్చికూతలు కూస్తున్నది. ఈ దేశం విభిన్న సంస్కృతుల కలయిక. విభిన్న వైవిధ్యాలు కల దేశం భారతదేశం. జాతీయగీతం లో చెప్పినట్టు పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ భంగ ఉచ్చల జలధి తరంగా ఈ గీతం లో విభిన్న ప్రాంతాలు విభిన్న జాతులు విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు కలగలిపి భిన్నత్వంలో ఏకత్వం- ఏకత్వంలో భిన్నత్వం కలిగి ఉన్న దేశాన్ని తమ విద్వేష రాజకీయాల కోసం సర్వనాశనం చేస్తుంది బిజెపి. ప్రాంతాల మధ్య విద్వేషాన్ని జాతుల మధ్య విద్వేషాన్ని కులాల మధ్య విద్వేషాన్ని మతాల మధ్య విద్వేషాన్ని రగిలించి ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించి పేదల సంపదను దోచుకున చూస్తుంది. దేశ సంపదను ఇద్దరు గుజరాతి నేతలు మరో ఇద్దరు గుజరాతి వ్యాపారస్తులకు అప్పనంగా దోచుపెడుతుంది. భారతీయులు ఈ దేశ సమగ్రత కోసం సమైక్యంగా పోరాడాలి.