అన్న ఎన్టీఆర్ వర్ధంతి -ప్రజలకు పండ్లు పంపిణీ

అన్న ఎన్టీఆర్ వర్ధంతి -ప్రజలకు పండ్లు పంపిణీ

అన్న ఎన్టీఆర్ వర్ధంతి -పేదలకు పండ్లు పంపిణీ

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రివర్యులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు  28 వ వర్ధంతి సందర్భంగా సింగ్ నగర్ పైపుల రోడ్డు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర రావు  మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేసినేని శివనాథ్( చిన్ని)  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ముందుగా నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఫ్రూట్స్ పంపిణీ చేసి ,స్వర్గీయ నందమూరి తారక రామారావు నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించి విశ్వ విఖ్యాత నట సార్వభముడు గా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని

నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేడు దేశమంతా అమలవుతున్నాయి అంటే, అది అయన గొప్పతనానికి నిదర్శనం అని,పేదవాడి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ సమకూర్చాలనే ఆలోచన చేసి వాటిని సమకూర్చిన మొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేదలకు రేషన్ కార్డు ను దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎన్టీర్  ప్రవేశ పెట్టారుఅని అదేవిధంగా గురుకులపాఠశాలలు,మహిళకుఆస్తిలోసమాన .హక్కు,రైతులకు50రూపాయలకే విద్యుత్,మహిళావిశ్విద్యాలయం,ఆరోగ్య విశ్వ విద్యాలయం .ఎర్పాటు,మాండలిక వ్యవస్థ,సహకార రంగంలో సింగిల్ విండో వ్యవస్థ ఎర్పాటు లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొచ్చారు అని  డబ్బు ఉన్నవారేమెడిసిన్,ఇంజినీరింగ్ చదివే అవకాశం ఉండేది . అటువంటిది ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ విధానాన్ని మార్చి ఎంసెట్ విధానాన్ని ప్రవేశ పెట్టి పేద వారు సైతం డాక్టర్లు,ఇంజినీర్లు అయ్యే అవకాశం కల్పించారు ఈరోజు దేశమంతా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

దేశంలోనే మొట్టమొదటి సారిగా స్థానిక సంస్థలలో మహిళలకు,బిసి లకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అనేకమంది .మహిళకు,బిసిలకు రాజకీయ భవష్యత్తు ప్రసాదించారు.ఇది కూడా ఈరోజు దేశం అంతా అమలు అవుతున్నది అని

40 సంవత్సరాల క్రితం ఎన్టీర్ ప్రవేశ పెట్టిన అనేక పథకాలు ఈరోజు దేశం అంతా అమలు అవుతున్నాయనటే అయన విజనరీ ఎటువంటిదో అర్థమవుతుంది అని

కావున రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది.కావున ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మనందరం అయన ఆశయ సాధనకు పునరంకితం అయ్యి తెలుగుదేశం పార్టీనీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని తెలియజేసారు . తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేసునేని ఫౌండేషన్ మేనేజింగ్ శివనాధ్ ( చిన్ని) మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలని పేదల జీవితాలు మార్చాలని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని ఆకాంక్షతో తనను దేవుడుగా కొలుస్తున్న సినీ రంగం నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించారని ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చే నాటికి అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను మార్చి సామాన్యుడి కూడా బ్రతికేలా చేసిన ఘనత ఎన్టీఆర్ ది తెలుగుదేశం పార్టీది అని కొనియాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీనీ ఎన్టీఆర్ ఏ ఆశయాల కోసం స్థాపించారొ చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయాలను కొనసాగిస్తున్నారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పక్షపాతి అని అనేకమంది బడుగు బలహీన వర్గాల నాయకులను చరిత్రలో నిలిచిపోయేలా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దేని కొనియాడారు. పేదలకు కిలో రెండు రూపాయల బియ్యం పథకం గాని, మహిళలకు ఆస్తి హక్కుల సమాన వాటా గాని, రైతులకు అనేక పథకాలు గాని ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ ది అని చెప్పారు.  ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టిఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు,దాసరి కనకరావు,పరుచూరి ప్రసాద్, ఘంటా కృష్ణమోహన్, సర్వేపల్లి ఆమర్నాధ్,దాసరి ఉదయశ్రీ,,ఆకుల సూర్యప్రకాష్,బుదాల సురేష్,పైడి తులసి, పైడి శ్రీను,దాసరి దుర్గారావు, దాసు, చాకర్లమూడి శ్రీనివాస్, తొట్టెంపూడి ఉదయ్ శంకర్, లీల,నాగమణి, సరోజిని తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు .