కస్తూరి బా గాంధీ బాలికల విద్యాలయం నందు విద్యార్థినిలకు డెంగ్యూ వ్యాధి పైన అవగాహన కార్యక్రమం

కస్తూరి బా గాంధీ బాలికల విద్యాలయం నందు విద్యార్థినిలకు డెంగ్యూ వ్యాధి పైన అవగాహన కార్యక్రమం
జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో డెంగు వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా ఈ రోజు కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం నందు విద్యార్థినిలకు డెంగు వ్యాధి పైన అవగాహనా కార్యక్రమం బి.బయమ్మ ప్రిన్సిపాల్ అద్వార్యం లో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్ద్రమం లో ఆరోగ్య పర్యవేక్ష్య కులు శర్మాస్ వలి మాట్లాడుతూ డెంగు జ్వరం ప్లావి విరిడే కుటుంబానికి చెందినా ప్లావి వైరస్ ద్వారా వస్తుంది. ఈ వైరస్ లను ఏడిస్ దోమలు ఒకరి నుండి ఒకరికి డెంగు జ్వరాన్ని వ్యాపి చేయును, ఈ దోమలు చిన్నగా నల్లగా ఉంది, శరీరం పైన తెల్లని చారలు ఉండును, తలపైన రెండు చారులు ఉండి దానికి ఇరువైపులా కొడవలి ఆకారం లో గుర్తులు ఉండును. ఈ దోమలు ఎక్కువగా పగటి పుట కుట్టును, ఈ దోమలు మన ఇంటి లోను ఇంటి పరిశరాలలోని మంచి నీటిలో పెరిగును, కావున ప్రతి ఒక్కరు డ్రై డే ఫ్రై డే ని పాటించి దోమ లార్వా దశ లోనే నివారించాలి. దోమ ఆవాస ప్రాంతాలైన పాత టైర్లు, కొబ్బరి బొండాలు,, పాత పనికి రాణి ఇనుప డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు, రోల్లలో, ఇంటి ముందర తొట్లు వంటి వాటిలో ఎక్కువగా గుడ్లు పెట్టి దోమలుగా మారును కావున వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం గా ఉంచుకోవాలి అన్నారు, ఈ కార్యక్రమం లో ఆరోగ్య కార్యకర్త T. శరత్ బాబు , ఆరోగ్య సిబ్బంది K. నగీన, K. సుస్మలత, రామంజంనమ్మ పాల్గొన్నారు. ,