నామినేషన్ దాఖలు చేసిన పుట్టపర్తి వైసిపి అభ్యర్ధి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు కార్యకర్తలతో కలిసి సత్యమ్మ సర్కిల్ నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందచేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.