*4వ విడత వై యస్ ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

*4వ విడత వై యస్ ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

జనచైతన్య న్యూస్.

యాడికి మండల కేంద్రం సంత మార్కెట్ నందు  4వ విడత వై యస్ అర్ ఆసరా కార్యక్రమాన్ని ఎంపీపీ ఉమాదేవి బొంబాయి రమేష్ నాయుడు అధ్యక్షతన  నిర్వహించగా  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారు హాజరై మహిళలకు వై యస్ అర్ ఆసరా సూపర్ చెక్కును అందించారు. ఈ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున హాజరై వరుసగా 4వ సారి వై యస్ అర్ ఆసరా అందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వై యస్ జగన్ మోహన్ రెడ్ది గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, బొంబాయి రమేష్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశ పెట్టిన వై యస్ అర్ ఆసరా పతకం వల్ల డ్వాక్రా మహిళలకు చాలా లబ్ది చేకూరుతుంది అని ఈ పథకాలు అన్ని మళ్ళీ మనకు కావాలంటే వై యస్ జగన్ మోహన్ రెడ్ది గారినే సీఎం గా చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరియు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ K. సావిత్రి,ఈఓ ఆర్ డి వెంకటేశ్వర్లు, ఏపీఎం చంద్రశేఖర్, ఈఓ ఎర్రిస్వామి,ఏ పి ఓ రమేష్,సర్పంచ్ పండు అనురాధ,ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ మండల నాయకులు, మాజీ జడ్పీటీసీ వెంకటరామి రెడ్ది,బ్రహ్మానంద రెడ్ది, ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, అవుకు నాగరాజు, గొడ్డుమర్రి రామమోహన్, వార్డ్ సభ్యులు గజ్జి బాలపెద్దయ్య, మేకల రామచంద్ర,మరియు మండల ప్రధాన కార్యదర్శి కోట చౌదరి, ఎస్సీ సెల్ కన్వీనర్ పండు శ్రీరాములు,సోషల్ మీడియా కన్వీనర్ పఠాన్ ఫరూక్, JCS ఇంచార్జ్ శివప్రసాద్,జేసీ నారాయణ రెడ్ది, వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొనడం జరిగింది.