దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి. ఎన్ ఎస్ యు ఐ, ఏఐ ఎస్ ఎ, ఏఐ ఎస్ ఎఫ్ , ఎస్ ఎఫ్ ఐ

దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి. ఎన్ ఎస్ యు ఐ, ఏఐ ఎస్ ఎ, ఏఐ ఎస్ ఎఫ్ , ఎస్ ఎఫ్ ఐ

దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి. ఎన్ ఎస్ యు ఐ, ఏఐ ఎస్ ఎ, ఏఐ ఎస్ ఎఫ్ , ఎస్ ఎఫ్ ఐ

 జనచైతన్య న్యూస్- కదిరి

 సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి, నీట్ పరీక్ష లీకులకు కారణమైన ఎన్ టి ఏ సంస్థను రద్దు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. వైద్య విద్యతో వ్యాపారమా, జాతీయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కదిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పత్రికా విలేకరుల సమావేశం. కదిరి నియోజకవర్గం నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి,నీట్ పరీక్షను రద్దు చేసి ఎన్టిఏ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలని జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని ఈరోజు జాతీయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు నరసింహ, ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకుడు గాలివీడు ఉపేంద్ర, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నల్లజోడు పవన్, జిల్లా ఉపాధ్యక్షులు శేషం మహేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు విజయ్, మాట్లాడుతూ జులై 4వ తేదీ జరిగే దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని జాతీయ విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్టిఏ) విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం అందులో ఆ ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కి సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలు కలిగిస్తున్నదని అన్నారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని రద్దు చేయాలని అదేవిధంగా నీట్ పరీక్షలు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవలే విడుదలైన నెట్ పరీక్ష ఫలితాలలో పేపర్ లీకేజ్ జరిగిందని మొన్నటి రోజున నెట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది, మరి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగిందని దోషులుగా ఒక విద్యార్థులు ఉండే 30 నుంచి 40 లక్షలు వసూలు చేశామని చెబుతున్నప్పటికీ నీటి పరీక్ష ఎందుకు రద్దు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు, తక్షణమే కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థులకు అటెంప్ట్ చేయకపోయినా కూడా 720కి 720 మార్కులు వేశారని పేర్కొన్నారు, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షని రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాదిమంది ప్రతిభగల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం ఎన్టిఏ విడుదల చేసిన పరీక్షా ఫలితాలపై పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యను వ్యాపారంగా మార్చే విధంగా నీట్ పరీక్షలలో పేపర్ లీకేజ్ చేసి వాళ్ళ విద్యాసంస్థలకు సంబంధించిన వారిని ఫస్ట్ మార్కులు తీసుకురావడం కోసం పేపర్ లీకేజ్ కు పాల్పడడం సరైనది కాదన్నారు. పేద మధ్య తరగతి విద్యార్థులు ఎంతో కష్టపడి చదివిన వారు ఇలా పేపర్ లీకేజ్ చేసి మార్కులు రావడంతో కష్టపడిన వారు ఎంతో బాధపడుతున్నారని తెలిపారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి నీట్ పరీక్ష పేపర్ను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు, దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన జరిగే విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, ఏఐఎస్ఎ డివిజన్ కార్యదర్శి దర్శన్, అభిరామ్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు జన, టిప్పు సుల్తాన్, దేవ, ఆరున్,శివ, AISF ఏఐ ఎస్ ఎఫ్ నాయకులు బన్నీ ,సాయి, రాము, మనోజ్, వినీత్, చైతన్య,మనోజ్,విజయ్, తదితరులు పాల్గొన్నారు.