శాంతి పురం మండల డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్

శాంతి పురం మండల డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్

శాంతి పురం మండల డిప్యూటీ సర్వేయర్ సస్పెండ్

 జనచైతన్య న్యూస్- చిత్తూరు

చిత్తూరు 01 జూలై 2024 శాంతి పురం మండల డిప్యూటీ సర్వేయర్ ఎస్.సద్దాం హుస్సేన్ ను సస్పెండ్చే చేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలలోకి వెళితే, జూన్ 27 న ఒక రైతు నుంచి సర్వే పని పూర్తి చేయడానికి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశారని డిప్యూటీ సర్వేయర్ పై అభియోగం ను ఒక రైతు చేయడం జరిగింది.ఆ మేరకు ఆయన వద్ద నుంచి లిఖిత పూర్వకంగా సమాధానం కోరగా అందుకు ఆయన ఇచ్చిన సమాధానం పై జాయింట్ కలెక్టర్ వారు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసస్ యాక్ట్ 8 ప్రకారం సర్వే ల్యాండ్ రికార్డ్స్ వారు జిఓఎం ఎస్ 102 రెవెన్యూ(SS2)ప్రకారం ఆయన సస్పెన్షన్ కు సిఫార్స్ చేయగా ఆ మేరకు జాయింట్ కలెక్టర్ వారు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు ఆయన విచారణకు సహాకరించడంతో పాటు శాంతిపురం మండల కేంద్రములో వుండాలని ఆదేశాలు జారీ చేశారు, మరియు మండలములో పనిచేయు మండల సర్వేయరు మరియు గ్రామ సచివాలయము నందు పనిచేయు గ్రామ సర్వేయర్లు సర్వే పనికి సంబంధించిన ఆర్జీలను సకాలములో పరిష్కరించవలెనని మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సర్వే పనులకు సంబంధించవన్నీయూ సకాలములో పూర్తి చేయవలయునని జిల్లా జాయింట్ కలెక్టర్ వారు ఆదేశించియున్నారు.