కారణజన్ముడు ఎన్టీఆర్ వర్ధంతి -అవినాష్
కారణజన్ముడు ఎన్టీఆర్ దేవినేని అవినాష్
విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )
ఆంధ్రుల ఆరాధ్యదైవం, కారణజన్ముడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఎన్టీఆర్ 28వ వర్థంతి సందర్భంగా చుట్టుగుంట డిఆర్ఆర్ కాంప్లెక్స్ వద్ద గల ఆ మహనీయుని విగ్రహానికి అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన ఘనత ఎన్టీఆర్ అని, రాజకీయ అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవడమే కాకుండా, ఎందరో యువకులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహామనిషి అని కొనియాడారు. నాడు ఆయనకు వెన్నుపోటు పొడిచి గద్దె దించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కేవలం ఓట్లు కోసం ఆయన పేరు వాడుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఎన్టీఆర్ సరైన గుర్తింపు ఇచ్చి జిల్లాకు ఆయన పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాధ్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జడా తేజ,దుర్గ గుడి మెంబెర్ బచ్చు మాధవి,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.