ప్రజా శ్రేయస్సు కోరే ప్రజల మనిషి మేడ శ్రీనివాస్ గెలుపు మా అందరి గెలుపు-జె డి ఆర్ ఎఫ్
మేడా గెలుపు _మన గెలుపు , ప్రజా గెలుపు _ జె.డి.ఆర్.ఎఫ్.
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
రాజమహేంద్రవరం
మేడా గెలుపు మన గెలుపు ప్రజా గెలుపనీ జర్నలిస్ట్ డెమొక్రటిక్ రైట్స్ పోరం
పిలుపు నిచ్చింది. జెడిఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు పి.కృష్ణ అధ్యక్షతన రాష్ర్టీయ ప్రజా
కాంగ్రెస్ వ్యవస్థాపకులు, ఉద్యమకారులు మేడా శ్రీనివాస్ గెలుపు కొరకు
ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ముందుగా అధ్యక్షలు
పి. కృష్ణా మాట్లాడుతూ ,
ఈ రోజు దేశంలో , రాష్ట్రంలో దొంగలదే రాజ్యమైంది, అక్రమాలు ,అన్యాయాలు ,అవినీతి చేసి , జైల్లుకు వెళ్లిన వారు రాజ్యా మేలుతున్నారు !
రాజమండ్రి పరిదిలో అభివృద్ధి చేయకుండా నీకు - నాకు పంపంకాలు అనే రీతిలో ఇక్కడ గెలిచిన వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు అనుకుంటున్నారు.
అంతే కానీ ! రాజమండ్రి అభివృద్ధి కానీ ! , రాజమండ్రి సహజ వనరులు , ప్రకృతి పరిరక్షణ కానీ ! పౌరులకు కావాల్సిన అవసరమైన వాటిని వదిలేసారు . ఈరోజు ఎన్డీయే కూటమి హామీలు , జగన్ ఇచ్చే పథకాలు, రాష్ర్టాన్ని అప్పుల్లో పడేసారు . ప్రజలను మభ్య పెట్టె పథకాలు ఇచ్చిఓట్లుదండుకుంటున్నారు. ధరలు పెంచి డబ్బులు తీసుకోనే విధంగా, ప్రజల్ను మలిచారు కావున మేడాను గెలిపించాలని కోరారు. జర్నలిస్ట్ డెమొక్రటిక్ రైట్స్ ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తంగిరాల సోని (నవీన్) మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్న బిజెపి కు ఈ పార్టీలు , పార్టీ నాయకులు వంత పాడుతున్నారు.ప్రజల్ని మభ్యపెడుతున్నారని , అంగడి సరుకుగా ప్రజల్ని , ప్రజాస్వామ్యాన్ని అమ్మేస్తున్నారు.ఈ క్రమంలో రాజమండ్రి సిటీ నుంచి రాష్ర్టీయ ప్రజా కాంగ్రెస్ శాసనసభ , పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజానాయకులు , ఉద్యమకారులు , న్యాయవాది , జర్నలిస్ట్ డెమొక్రటిక్ రైట్స్ ఫోరం జాతీయ ప్రధాన కార్యదర్శి , విద్యావేత్త , ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇన్ని అర్హతలు కల్గిన ప్రజల మనిషి , స్థానికుడు మేడా శ్రీనివాస్ గారు రాజమండ్రి నుంచి పోటి చేస్తున్నారని . వీరు అసెంబ్లీ గుర్తు ' గ్లాజ్ ' గాసు ను పోరాటం ద్వారా న్యాయస్థానం వీరి గుర్తు ' గాజ్ గ్లాసు ' వీరికే కేటాయించింది. అలానే రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు గా 'గ్యాస్ సిలిండర్ ' కేటాయించింది.వీరికి 6 వ సీరియల్ నెంబర్ కేటాయించిందని అందరూ మేడా శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు.
జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం పుల్లారావు మాట్లాడుతూ.... మేడా శ్రీనివాస్ మన వాడు , మన మనిషి , మన కోసం , సమస్యలపై కలం , గళం ఎత్తిన నాయకుడు , భాధ్యత గల పౌరులారా ! 77 సంవత్సరాల స్వతంత్ర్యంలో ఓటు వేస్తున్నం , ఓడిపోతునే వున్నాం , ఇప్పటికైన మన కళ్ళు తేరుచుకుని , మన సమస్యలను పరిష్కరించే నాయకుడు' మేడా శ్రీనివాస్ ' రాజమండ్రి లో మేడా శ్రీనివాస్ తేలియని వారు లేరు , ఆయనకు మన రాజమండ్రి ఎలా అభివృద్ధి చేయాలో తెలుసు మేడా శ్రీనివాస్ కు మనం ఓటు వేసి , పార్లమెంట్ ,.అసెంబ్లీ కు గెలిపించి పంపించాల్సిన బాధ్యత మనది . ఆయన గెలుపు , మన గెలుపు , ప్రజా గెలుపని చెప్పారు. ఈ సమావేశంలో జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం సభ్యులు జి మురళీకృష్ణ, వై.శ్రీనివాసరావు , న్యూటన్, దడాల సత్తిబాబు, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు డెమొక్రటిక్ రైట్స్ ఫోరం -ఆంధ్రప్రదేశ్.