ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించిన కేంద్రం కరువు నివారణ బృందాన్ని కలిసి వినతి పత్రం సమర్పించిన బిజెపి ప్రతినిధి బృందం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించిన కేంద్రం కరువు నివారణ బృందాన్ని కలిసి వినతి పత్రం సమర్పించిన బిజెపి ప్రతినిధి బృందం

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించిన కేంద్రం కరువు నివారణ బృందాన్ని కలిసి వినతి పత్రం సమర్పించిన బిజెపి ప్రతినిధి బృందం

 జనచైతన్య న్యూస్- అనంతపురం

 అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కువ శాతం వ్యవసాయ రైతులు వర్షాధారం మీద ఆధారపడతారు. ముఖ్యంగా సత్యసాయి జిల్లా లో 90 శాతం పైగా వర్షాధారం పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంట నష్టం జరుగుతున్నది. అకాల వర్షాల కారణంగా కూడా పంట నష్టం జరుగుతుందని,తీవ్రమైన ఎండలు, కరువు కాటకాలతో జిల్లాలో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్న ప్రాంతంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ముఖ్య విషయాలు పీఎం కిసాన్ సన్మానిది కరువు మండలాలను ప్రత్యేకంగా గుర్తించి ఎక్కువ నిధులు కేటాయించాలి, జిల్లాలో వ్యవసాయ అనుభంద పరిశ్రమ ఏర్పాటు చేయాలి,  రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగింది, కానీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం లేదు, వ్యవసాయం లో రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడడం తో భూసారం నశించి పోతున్నాయి, దీనిపై చర్యలు తీసుకోవాలి, రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, ఈ జిల్లాలో వేరుశనగతో పాటు ప్రత్యామ్నాయ పంటలైన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి, ప్రభుత్వం సరఫరా చేస్తున్న విత్తనాలలో నాణ్యత లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు,దీనిపైన విచారణ జరిపించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు 1 ఎకరాకు 50 వేల రూపాయలు ఇస్తున్న పరంపరాగత్ కృషి వికాస్ యోజన నిధులు రైతులకు అందడం లేదు దీనిపై విచారణ చేపట్టి రైతులకు అందే విధంగా చూడాలి, ప్రకృతి వ్యవసాయం విధానాన్ని ప్రోత్సహించాలని కోరారు, ఈ బృందంలో బిజెపి కిసాన్ మోర్చ ఆర్గానిక్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి , కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సమీవుల్లా, మండల అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, హనుమంతు యాదవ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.