కోలాహలంగా ఎమ్మెల్సీ రుహుల్ల జన్మదిన వేడుకలు-సెంట్రల్

కోలాహలంగా, జనజాతరను తలపించే విధంగా ఎమ్మెల్సీ రుహుల్లా జన్మదిన వేడుకలు
విజయవాడ- జనచైతన్య (తమ్మిన గంగాధర్)
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్సీ జనాబ్ ఎండీ రుహుల్లా గారి జన్మదిన వేడుకలు 59వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ షాహినా సుల్తానా హఫీజుల్లా ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కోలాహలంగా, కనులపండువుగా జనజాతరను తలపించే విధంగా జరిగాయి. విజయవాడ నలువైపుల నుండి వైసీపీ కుటుంబ సభ్యులందరు పెద్ద ఎత్తున తరలి రావడంతో అజిత్ సింగ్ నగర్ డాబాకొట్ల సెంటర్ లోని ఎమ్మెల్సీ రుహుల్లా కార్యాలయం పరిశర ప్రాంతంలో సందడి వాతావరణం కనిపించింది. ప్రతిఒక్కరుహృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపగా, హ్యాపీ హ్యాపీ బర్త్డే రుహుల్లా భాయి అంటూ యువకుల నినాదంతో అజిత్ సింగ్ నగర్ పరిశరాలు మార్మోగాయి .