నేతాజీ సేవలు మరువలేనివి

నేతాజీ     సేవలు    మరువలేనివి

నేతాజీ సేవలు మరువలేనివి

విజయవాడ _ జన చైతన్య   (తమ్మిన గంగాధర్)

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

దేశ స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాట సేవలను ఎప్పటికి మరువలేమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం దుర్గాపురంలోని ఆయన విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాంతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. ఎనలేని ధైర్యసాహసాలకు, దేశభక్తికి నేతాజీ ప్రతీక అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో లక్షలాది మంది ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. దేశాన్ని దాస్యశృంఖలాలనుంచి విముక్తం చేసేందుకు. ‘జైహింద్’ నినాదంతో యువతను ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ వైపు నడిపిన స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. ఆయన జీవితం దాదాపు అజ్ఞాతవాసం లాంటిదేనని, జీవితంలో ఎక్కువ భాగం ప్రవాసంలో గడిపారని తెలిపారు. దేశం కోసం తన సర్వస్వం త్యాగం చేశారని కీర్తించారు. అటువంటి అలుపెరుగని పోరాట యోధుడి జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని.. ముఖ్యంగా నేటి యువత నేతాజీని స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 29వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.