నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి
నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
పిడిఎస్ యు డిమాండ్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు జాతీయ కన్వీనర్ ఎం. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు విజయవాడలోని గాంధీనగర్ లో పిడిఎస్ యు రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది పాఠశాల విద్యని ధ్వంసం చేసింది. పాఠ్యాంశాలను కాషాయీకరిస్తుంది పాఠశాల నుండి యూనివర్సిటీల వరకు అనేక సమస్యలు ఉన్నాయి యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా యూనివర్సిటీ గ్రాండ్ కమిషనర్ని రద్దు చేసింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు సమరశీల పోరాటాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. పిడిఎస్ యు మాజీ రాష్ట్ర అధ్యక్షులు యు.గనిరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కుమార్ మాట్లాడుతూ
ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. సుమారు 25 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తుంది. వివిధ శాఖలలో2.30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలి. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ వేస్తామన్న జగన్ అధికారంలోకొచ్చి నాలుగున్నర ఏళ్ళు అవుతుంది. ఐదు లక్షల పైగా బీఈడీ, డీఈడీ చేసిన నిరుద్యోగులుఎదురుచూస్తున్న ఒక్క టీచర్ పోస్టులు కూడా కొత్తగా భర్తీ చేయలేదు. రాష్ట్రంలో 9000 ఏక ఉపాధ్యాయ పాఠశాలలున్నాయి. వెంటనే మెగా డీఎస్సీని నిర్వహించాలి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి 9 సంవత్సరాలు కావస్తున్న ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. రైల్వేలో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వెంటనే వీటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1,2 పోస్టులు పెంచాలని నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకన్న, సునీల్, జునైద్ భాష సహాయ కార్యదర్శులు నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేశ్వర, రఫీ, మానస, ప్రసన్న,షారుక్, సిసింద్రీ ,తదితరులు పాల్గొన్నారు. ఎం. వినోద్ కుమార్ పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.