పేదలకు వరం జగనన్న ఆరోగ్య సురక్ష

పేదలకు  వరం  జగనన్న ఆరోగ్య   సురక్ష

పేదలకు వరంలా మారిన జగనన్న ఆరోగ్య సురక్ష   

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

దేవినేని అవినాష్

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రెండో విడత జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమం పేదల జీవితాల్లో ఒక వరంలా మారి వారికి ఆరోగ్య భరోసానిస్తుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 16వ డివిజన్,77వసచివాలయం,పోలీస్ కాలనీ నందు జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ లను అవినాష్ ప్రారభించి వైద్యారోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా వైద్యానికి దూరం కాకూడదు అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం అని అందుకే నాడు స్వర్గీయ వైయస్సార్  ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పధకంను తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్వీర్యం చేసిన సరే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ ని అమలు చేయడమే కాకుండా దానిని మరింత విస్తృత పరచి వెయ్యి రూపాయలు దాటినా ప్రతి వైద్య సేవను దాని పరిధిలోకి తీసుకొచ్చి మంచి మనసు చాటుకొన్నారని అన్నారు. నేడు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య పరీక్షలు చేయించుకువడానికి కూడా డబ్బులు లేని పేదవారికి వేల రూపాయలు ఖర్చు అయ్యే పరీక్షలు ఉచితంగా నిర్వహించడమే కాకుండా వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి నయమయ్యే వరకు వైద్యారోగ్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని అన్నారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుంది అని కొనియాడారు. ప్రజలందరూ ఈ సురక్ష క్యాంపు లు వినియోగించుకోవాలని, ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని   అవినాష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ ప్రెసిడెంట్లు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు .