పసి బిడ్డలకు పోలియో చుక్కలు వేస్తున్న-దేవినేని అవినాష్

పసి బిడ్డలకు పోలియో చుక్కలు వేస్తున్న-దేవినేని అవినాష్

చిన్నారులకు పోలియో చుక్కలు వేసన_దేవినేని అవినాష్

విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)

పసిబిడ్డలకు 0నుండి 5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి  పోలియో రహిత రాష్ట్రం గా చేయాలని దేవినేని అవినాష్ అన్నారు. ఆదివారం 5వ డివిజన్,క్రీస్తురాజుపురం వైస్సార్ అర్బన్ సెంటర్ నందు తూర్పు నియోజకవర్గ సంబంధించి 125 పల్స్ పోలియో కేంద్రాలను  నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ప్రారంభించి  పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా అవినాష్ పుట్టిన పసిబిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. నిండు జీవితానికి రెండు చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి గ్రామంలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేసి అన్ని వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారని అన్నారు. ఆరోగ్య ఆంద్రప్రదేశ్ లక్ష్యం గా గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలను నాడు నేడు కింద ఆధునికరించి పెద్ద ఎత్తున డాక్టర్ల నియామకం చేపట్టారని తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిధి విస్తరించి పేదవారికి అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో CMOH రత్నావలి,స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్,డాక్టర్ చిట్టిబాబు మరియు వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు ఒగ్గు విఠల్, చిత్రం లోకేష్, వరుణ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.