సోఫియా తండ్రి ఆవేదన చలనం లేని కేసు-స్పందన

కృష్ణజిల్లా గుడివాడ నియోజకవర్గం సోఫియా తండ్రి రెండోవ సారి స్పందన కార్యక్రమంలో పిర్యాదు
విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)
కొలిక్కిరాని సోఫియా కేస్ రోజులు గడిపేస్తున్న సంబంధిత అధికారులు.
కేస్ విషయమై సదరు పోలీస్ వెళ్లగా మళ్ళీ అప్పుడే పిర్యాదు చేసినట్లు నన్ను విచారిస్తున్నారు అంటూ సోఫియా తండ్రి ఆవేదన. నవంబర్ 07 చనిపోయిన సోఫియాను 2023 డిసెంబర్ 6 అంబేడ్కర్ వర్దంతి రోజున సోఫియా మరణం పై ఉన్న అనుమానాలతో పిర్యాదు చేయగా డాక్టర్ పిన్నమనేని ప్రశాంత్ మరో నలుగురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి గుడివాడ డి.ఎస్.పి పి.శ్రీకాంత్ ఎమ్మార్వో కే.ఆంజనేయులు మరికొందరి సిబ్బంది సమక్షంలో సోఫియా సమాధిని తవ్వి మృతదేహం యొక్క శాంపిల్స్ తీసుకున్నారు.
కానీ ఇప్పటి వరకు కేస్ సంబందించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అంటూ సోఫియా తండ్రి సింగవరపు జోసెఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సుమారు 60రోజులు కాగా ఇప్పటికి ఎలాంటి సమాచారం కానీ విచారణ గాని జరపలేదు కేసును నీరుగార్చే విధంగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. నా దగ్గర నుండి నా కూతురు మొబైల్ ఫోన్స్ అన్ని తీసుకొని వెళ్లారు. మొదట సారి స్పందన కార్యక్రమంలో రిపోర్ట్స్ గురించి బదిలీపై వెళ్లిన సి.ఐ ని అడుగగా రెండు నెలలు పడుతుంది అని చెప్పగా ,కొత్తగా వచ్చిన టూ-టౌన్ సి.ఐ 6నెలలు పడుతుందని చెప్పారు.. ఇలా అధికారులు బదిలీపై మార్పులు జరిగితే వచ్చిన వారు రోజు నెలలు పెంచుకుంటూ నాకు కూతురి మృతికి అన్యాయం చేస్తారా అంటున్నారు. సమాజంలో పెద్ద పేరు ఆర్థిక,అంగ-బలం కలిగిన పిన్నమనేని ప్రశాంత్ తదితరులు కేస్ తారుమారు చేసే విధంగా పని చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయ
అధికారులు పని తీరు ఇలాగే ఉంటే నా కుటుంబంతో న్యాయం జరిగే వరకు ఎక్కడికైనా వెళ్తానన్నారు.