టిడిపి నుంచి 20 కుటుంబాలు వైసీపీలోకి చేరిక
కదిరి: తనకల్లు మండల పరిధిలోని ఈతోడు గ్రామానికి చెందిన 20 కుటుంబాలు శుక్రవారం కదిరి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కడపల మోహన్ రెడ్డి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆ పార్టీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్, మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణలు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.