రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వందే- దేవినేని అవినాష్

రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వందే- దేవినేని అవినాష్

క్రిష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మించి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వందే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం 17వ డివిజన్ 81వ సచివాలయం లో జరిగిన వై ఏపీ నీడ్స్ వైయస్ జగన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ఆ సచివాలయ పరిధిలో ఈ నాలుగున్నారేళ్ల కాలంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ద్వారా అందించిన సంక్షేమ లబ్ది వివరాల డిస్ ప్లై బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో మేము భుపేష్ గుప్తా నగర్ నుండి తారకరామా నగర్ వరకు పాదయాత్ర గా వెళ్లి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే ఇక్కడ నివసించే మహిళలు అసలు మేము కట్టగలమా లేక గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా ప్రచారాలకే పరిమితం అవుతామ అని అప నమ్మకంగా చూశారని, కానీ మేము రిటైనింగ్ వాల్ నిర్మించిన తర్వాత అదే మహిళలు వచ్చి తమ సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిటైనింగ్ వాల్ పేరిట నానా హడావుడి చేసి తీరప్రాంత ప్రజలను మోసం చేసారని విమర్శించారు. కేవలం సంవత్సరం కాలంలోనే నిర్మించి దేశంలోనే మిగతా రాష్ట్రాలు కూడా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం అనేది ఒక ఉదాహరణగా తీసుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా నిర్మాణ సమయంలో ఇళ్ళు తొలగించిన 583 మందికి పూర్తి ఉచితంగా అన్ని మౌలిక సదుపాయాలతో నూతన గృహాలు మంజూరు చేసిన గొప్ప మనసున్న నాయకుడు జగన్ గారు అని కొనియాడారు. ఈ సచివాలయ పరిధిలో గతంలో మాదిరిగా ఎవరో ఒకరిద్దరు కు సంక్షేమ పథకాలు అందించి చేతులు దులుపోకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపు 5960 మందికి 13 కోట్ల రూపాయల సంక్షేమ లబ్ది అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వం దే అని తెలిపారు. జన్మభూమి కమిటీలు, దళారులు లేకుండా నేరుగా మీ ఇంటి వద్ద కే పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ మీ నమ్మకం నిలబెట్టుకొన్నాం కాబట్టే ధైర్యంగా మీ ముందుకు వచ్చి583 ఈ రాష్ర్టానికి మరలా ఎందుకు జగన్ ముఖ్యమంత్రి గా ఉండాలి అనేది వివరిస్తున్నామని, మీ ఆశీస్సులు ఆదరణతో మరోమారు వైసీపీ ప్రభుత్వం రావడం ఖాయమని, తూర్పు లో కూడా వైసీపీ జెండా ఎగురవేస్తామని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గా, స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, శాప్ డైరెక్టర్ కావటి దామోదర, నాగవంశీ కార్పొరేషన్ డైరెక్టర్ సుజాతా, అధ్యక్షులు కాశిం, సీనియర్ నాయకులు బొడ్డు అప్పలనాయిడు, చింతా బుచ్చి బాబు, తాజుద్దీన్, అయ్యప్ప రెడ్డి, నరసింహ రెడ్డి, అమ్మిరెడ్డి లక్ష్మి, భులక్ష్మి, రాజు, బాసి, చిన్నారి మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.