ఐచర్ వాహనం ఢీ కొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి
ఐచర్ వాహనం డి కొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి
జనచైతన్య న్యూస్-తలుపుల
సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని పల్లవాండ్లపల్లి, బైగారిపల్లి గ్రామాల సమీపనందు జియో లో పనిచేస్తున్న కదిరికి చెందిన రజక కులానికి చెందిన శేషాద్రి 23 మంగళవారం విధులు ముగించుకొని ఓబుళ రెడ్డి పల్లి నుంచి తలుపులకు వెళుతుండగా కదిరి నుంచి ఐచర్ వాహనం పెయింట్ లోడ్ అన్లోడ్ చేసి కదిరి నుంచి వెళ్లి వెలిచెలమల గ్రామానికి వెళుతుండగా పల్లవాండ్లపల్లి గ్రామ సమీపన ఐచర్ వాహనం డ్రైవర్ అజాగ్రత్త వల్ల ద్విచక్ర వాహనదారుని ఢీకొనడంతో చుట్టుపక్కల గ్రామస్తులు శేషాద్రిని తలుపులకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని మృదహాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు.