అక్రమ ఇసుక రవాణా -వైసిపి అధికార నాయకులు హస్తం
విజయవాడ మాజీ వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ అక్రమ ఇసుక రవాణా విజయవాడ__జనచైతన్య_ (రిషితకుమార్)______________________విజయవాడలో అక్రమంగా తరలిస్తున్న దొంగ ఇసుక.వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు నడిపిస్తున్న ఇసుక లారీలు అని సమాచారం.ఉద్దండరాయిపాలెం నుండి గొల్లపూడి వైపుగా స్వాతి రోడ్ లో నుండి భవానిపురం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న చక్రవర్తికి చెందిన కనకమహాలక్ష్మి కాటా వద్దకు ఈ ఇసుక లారీలు విచ్చలవిడిగా దొంగ కాటా వేస్తుండగా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు.
ఒక లారీకి నెంబర్ ప్లేట్లు కూడా లేకుండా నడపడం గమనార్హం. ఆర్టీవో అధికారులు కూడా దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్.