సీఐటీయు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

సీఐటీయు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా

సీఐటీయు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా 

ఓబులదేవరచెరువు జనచైతన్య న్యూస్ :-జిల్లావ్యాప్తంగా అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం, ఫీల్డ్ అసిస్టెంట్, కాంటాక్ట్ అవుట్సోర్సింగ్, మున్సిపల్ కార్మికులు, యానిమేటర్స్ కార్మికుల పై రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఈనెల 5వ తేదీన సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టబోయే ధర్నా లో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని, శనివారం సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటకనే జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను రాజకీయంగా వేధిస్తూ అక్రమంగా తొలగిస్తున్నారని తెలిపారు. టిడిపి నాయకుడు వేధింపులు భరించలేక ఓడిసి మండలం వీరప్పగారి పల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి విషం తాగి ఆత్మహత్యాయత్ననికి పాల్పడిందన్నారు. చిరుద్యోగుల పైన వేధింపులు ఆపకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని ఒక ప్రకటనలో వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంగమ్మ. ఆశీర్వాదమ్మ.సిఐటియు నాయకులు పోరాటాల శ్రీరాములు,సీఐటీయు మండల కన్వీనర్ కుళ్లాయప్ప, శ్రీనివాసులు, శ్రీకాంత్, నాగరాజు, లక్ష్మీపతి,పాల్గొన్నారు.