మాదిగల పంతం, వర్గీకరణ సొంతం

మాదిగల పంతం, వర్గీకరణ సొంతం

మాదిగల పంతం, వర్గీకరణ సొంతం

 జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు 

 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో మాదిగల మహాత్ముడు మాన్య మందా క్రిష్ణ మాదిగ పోరాటం తో మూడుదశాబ్దాల మాదిగ, ఉపకులాల కల వర్గీకరణ, నిన్నటి రోజున భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు తో మాదిగ పల్లెల్లో పట్టణాల్లో ఊరు వాడల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దపప్పూరు టి ఆదినారాయణ మాదిగ, తాడపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ యం పెద్దిరాజు మాదిగ, హాజరై పెద్దపప్పూరు మండల అధ్యక్షుడు పసల కంబగిరి మాదిగ, ఆధ్వర్యంలో పెద్దపప్పూరు సిపిఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం ఆధ్వర్యంలో వర్గీకరణ సంబరాలు ఘనంగా జరిగాయి. పెద్దపప్పూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నాయకులంతా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి టి ఆదినారాయణ మాదిగ, కేక్ కటింగ్ చేసి అందరికీ పెట్టారు,బాబు మాదిగ కృష్ణాన్నా,  చంద్రబాబు మోడీ చిత్ర పటాలు కు పాలాభిషేకం చేసారు. 30సంవత్సరాలు మాదిగ, ఉపకులాల ఆకాంక్ష నెరవేరింది, దీనికి కారణమైన మాన్య మందా క్రిష్ణ మాదిగ  ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలిపారు. తాడపత్రి నియోజకవర్గ పెద్దపప్పూరు మండలం ఎమ్మార్పీఎస్ తదితరులు పెద్ద ఎత్తున మాదిగలు విచ్చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జూటూరు నవీన్, ఎంఎస్ఎఫ్ మండల నాయకులు చిన్న నరసింహులు మాదిగ, జి ఆదినారాయణ, వాల్మీకి సంఘం నాయకుడు తలారి ఈశ్వరయ్య, మాజీ సిఓ ఆర్డిటి రామాంజనేయులు, నారాయణ, రంగడు పాల్గొన్నారు.