డిస్కమ్ అధికారులతో తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి సమీక్షా సమావేశం

డిస్కమ్ అధికారులతో తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి సమీక్షా సమావేశం

డిస్కమ్ అధికారులతో తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి సమీక్షా సమావేశం

 జనచైతన్య న్యూస్-తాడిపత్రి 

 అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని జెసి స్వగృహం నందు నియోజకవర్గంలోని తాడిపత్రి పట్టణం, తాడిపత్రి రూరల్, యాడికి, పెద్ద వడుగూరు, పెద్ద పప్పూరు మండలాలలో విద్యుత్ సరఫరా పై అధికారులతో సమీక్షించారు.ముఖ్యంగా రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఖచ్చితంగా జరగాలని అధికారులను ఆదేశించారు.పట్టణం, మండల కేంద్రాలలో విద్యుత్తు సరఫరా కోతలు లేకుండా చూడాలని కోరారు, విద్యుత్ కోతల వల్ల చేనేతలకు ఇబ్బందులు ఏర్పడ కూడదని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో గుత్తి డి ఈ రాజశేఖర్, తాడిపత్రి ఏ డి  రఘు, తాడిపత్రి రూరల్ ఏ డి వసంత కుమార్, తాడిపత్రి పట్టణ ఏ ఈ ఉదయ్, భాస్కర్, వీరాంజనేయ రెడ్డి, గ్రామీణ ఏ ఈ సుదర్శన్ రెడ్డి, యాడికి ఏ ఈ రాజారావు, పెద్ద వడుగూరు ఏ ఈ మధు సూధన్, ఇతర అధికారులు శ్రీనివాస రెడ్డి లు పాల్గొన్నారు.