వృద్ధులకు ,వికలాంగులకు పెన్షన్ ఇళ్ల దగ్గర ఇవ్వాలి- RTI చంద్రమోహన్

వృద్ధులకు ,వికలాంగులకు పెన్షన్ ఇళ్ల దగ్గర ఇవ్వాలి- RTI చంద్రమోహన్

పెన్షన్ ఇళ్ళ వద్దే ఇవ్వాలి : ఎఫ్ ఆర్టీఐ

అమరావతి, ఏప్రిల్ 2: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పెన్షన్ ను వృద్దులకు,వికలాంగులకు వారి ఇళ్ళ వద్దనే ఇవ్వాలని ఫోరమ్ ఫర్ ఆర్టీఐ (ఎఫ్ ఆర్టీఐ) జాతీయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. ఎస్.జవహర్ రెడ్డి,అన్ని జిల్లాల కలెక్టర్ లకు విజ్ఞప్తి చేసింది. వేసవి కాలంలో వృద్ధులను, వికలాంగులను ఇబ్బందులకు గురి చేయకుండా సచివాలయం ,పంచాయతీ రాజ్ సిబ్బంది తో పెన్షన్ ఇళ్ళ వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పెన్షన్ ఇచ్చే కాయలయాల వద్ద మంచినీటి సౌకర్యం, ప్రథమ చికిత్స అందేలా చూడాలని, క్యూలో ఎండలో నిలబెట్ట వద్దని, పెన్షన్ దారుల ప్రాణాలకు ఇబ్బందులు ఏర్పడితే సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలి అని కమిటి తెలిపింది. పెన్షన్ ఇచ్చే కార్యాలయాల వద్ద ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్ శ్రేణులు, జర్నలిస్టు మిత్రులు సేవా దృక్పదం తో వెళ్లి సక్రమంగా జరిగేలా చూడాలని జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ కోరారు.