ఫైలేరియా నులిపురుగుల నివారణకై అవగాహన ర్యాలీ

ఫైలేరియా నులిపురుగుల నివారణకై అవగాహన ర్యాలీ
జనచైతన్య న్యూస్- జిన్నారం
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం జిన్నారం మండలంలోని గ్రామంలో గురువారం జాతీయ ఫైలేరియా నూలి పురుగుల నివారణకై పాఠశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎన్ఎం వసంత మాట్లాడుతూ ఈ వర్షాకాలం నీరు నిల్వ ఉండే ప్రాంతంలో దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇంటి చుట్టూ ప్రక్కల శుభ్రంగా ఉంచుకోవాలని, జాతీయ ఫైలేరియా నూలి పురుగుల నిర్మూలన లో భాగంగా 10 ఆగస్టు 2024 నుండి 25 ఆగస్టు 2024 వరకు ఉచిత మాత్రలు పంపిణీ కార్యక్రమం ఉంటుందని, మనిషి శరీర భాగంలో ఎక్కడ ఎక్కడ ఫైలేరియా వస్తుంది, అనే విషయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ హైస్కూల్ ఉపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్ ఏర్పుల భాస్కర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.